BREAKING
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత పెర్కంపల్లి హల్దీ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత విఠల్‌ రెడ్డి ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరుకావాలి - ఎంపీడీఓ నాగేశ్ జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి. భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం! బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి : డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల సంఖ్య 2022 స్థాయికి చేరువ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ

లబ్దిదారులకు చేయÖత పెన్షన్ మంజూరు పత్రాల అందజేత

Select Suryaa Now
లబ్దిదారులకు చేయÖత పెన్షన్ మంజూరు పత్రాల అందజేత

సూర్య బోధన్ : బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మున్సిపల్ పరిధిలోని లబ్దిదారులకు నూతన చేయూత పెన్షన్ పథకం మంజూరు పత్రాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. వారి కోసం రేషన్ ద్వారా  సన్నబియ్యం అందజేయడంతో పాటు వికలాంగుల, ఒంటరి, వితంతు మహిళల కోసం నూతనంగా చేయూత పెన్షన్‌లను సైతం మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్ద మరణిస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సైతం ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు కమిషన్‌లకు కక్కుర్తి పడి పేద ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందించలేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి, డిపిసిసి డెలిగేట్ గంగశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావు, మున్సిపల్ వైస్ చైన్ ఇలియాస్, కౌన్సిలర్‌లు అది నారాయణ, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.