చీమకుర్తి హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
చీమకుర్తి, మేజర్‌న్యూస్ :
శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి కలశ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం చీమకుర్తి హరిహర క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీమంత్రి శిద్దా రాఘవరావు, శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు క్షేత్రంలో వేంచేసి ఉన్న సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏటా ఆనవాయితీగా చీమకుర్తి హరిహర క్షేత్రంలో నిర్వహించే కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ అయ్యప్పస్వామి వారికి మహా గణపతి పూజ,గంగ పూజ, మండపారాధన మహన్యాసక పఠనం,ఆదిత్యాధి నవగ్రహ పూజ అనంతరం అయ్యప్పస్వామి వారికి సుగంధ,పంచామృత, క్షీర, పరిమళ,పుష్ప,పండ్ల రసాలతో అభిషేకాలు,అష్టోత్తర పూజలు, పుష్పాలతో అలంకరణ, స్వామి వారికి నివేదన,మంగళహారతులు, మంత్ర పుష్పం వేద పండితులు నెలభోట్ల రామ కృష్ణ శాస్త్రి, మనోజ్ శర్మ బృందం మరియు పమిడికంఠం సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శిద్దా రాఘవరావు, శ్రీమతి శిద్దా లక్ష్మీ పద్మావతి దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు,కుటుంబ సభ్యులు,సర్వ దీక్ష స్వాములతో కలసి అయ్యప్పస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.అనంతరం శిద్దా రాఘవరావు దంపతులు శ్రీ అయ్యప్పస్వామి వారిని ప్రదక్షిణపూర్వకంగా ఛత్ర చామరాలతో,మంగళ వాయిద్యాల వేద మంత్రాలతో శ్రీ అయ్యప్పస్వామి వారిని వూరేగింపు నిర్వహించి శ్రీ అయ్యప్పస్వామి అంతరాలయానికి చేర్చి విశేష పూజలు నిర్వహించి మహా హారతులు సమర్పించారు. శ్రీ హరిహర క్షేత్రంలో అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సకల దీక్షా స్వాముల అయ్యప్ప శరణు ఘోషలు హరిహర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నేలకొంది,శిద్దా వెంకటేశ్వర్లు, శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధాకర్ దంపతులు,కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం లాంఛనంగా ప్రారంభించి సర్వ దీక్ష స్వాములకు స్వహస్తాలతో అన్న ప్రసాదాలు వడ్డీంచారు. నేటి నుండి ప్రతి రోజు సర్వ దీక్షా స్వాములకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు శిద్దా రాఘవరావు తెలిపారు.కార్తీక మాసం ఏకాదశి సందర్బంగా హరి హర క్షేత్రంలో శ్రీమాన్ వెంకట హరి కుమరా చార్యులు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.కార్తీక మాసం పునస్కరించుకొని ఆలయ అర్చకులు హరి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు,అలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిద్దా వెంకట ప్రసాద్ దంపతులు,,డా.సుబ్రహ్మణ్యం,చీమకుర్తి కోటిలింగం దంపతులు,శిద్దా సురేష్ చీమకుర్తి పరిసర ప్రాంతాలను చెందిన సర్వ దీక్షా స్వాములు, వాసవి మహిళలు,గ్రానైట్ రంగాలకు చెందిన ప్రముఖులు,
చీమకుర్తి కి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.