వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం వెల్లటూరులో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వెల్లటూరు గ్రామ పంచాయతీకి జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు శుక్రవారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో
నామినేషన్ లు దాఖలు అయ్యాయి. వెల్లటూరు సర్పంచ్ స్థానానికి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మోటూరు పుణ్య శ్రీనివాస కుమార్(చినబాబు), మరో 14 మంది వార్డు సభ్యులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అబ్దుల్ ఖాదర్ జిలాని కి అందించారు. ఎన్నికల అధికారి జిలాని మాట్లాడుతూ వార్డు సభ్యులుగా పెరికలపూడి మరియదాసు ,వాకా వెంకటలక్ష్మి దీపిక, బత్తుల రమణమ్మ ,క్రాప రవికుమార్ నాదెళ్ల జ్యోతి , కట్టా జ్యోతి, పోకూరి జ్యోతి ,గుమ్మడి స్వామియేలుబాబు, గుంటూరు వినోద్ బాబు, పోతార్లంక రాజేష్, ఆరేపల్లి నాగ ప్రవీణ్ కుమార్, తుపాకుల చిన్నమ్మ ,వర్రే రోజా, పెరవలి సువార్తలు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా గ్రామ దేవత శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయంలో మోటూరు చినబాబు మరియు వార్డు అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయానికి విచ్చేశారు.ఈ కార్యక్రమంలో గొట్టిపాటి కృష్ణారావు, పమిడిముక్కల సాంబశివరావు, ,ఎంపీటీసీ డొక్కా రామస్వామి,జంపని వర్ధని, మాజీ ఎంపీటీసీ వాకా వెంకటనారాయణ, కేతావత్ రమేష్ ,గుంటూరు రాంబాబు తదితర పార్టీ నాయకులు, కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.