ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్
గుంటూరు : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యాశాక మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ గుంటూరు నగరంలోని కొత్తపేట లోని భగత్ సింగ్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం చెపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల విద్య వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని ప్రధానంగా రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నెట్టివేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోరాటాల ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం కారణంగా అనేకమంది విద్యార్థులకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు చదువు పూర్తయిన సర్టిఫికెట్లను ఇవ్వటం లేదని వాపోయారు . ఎగ్జామ్ ఫీజులు చెల్లించడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. ఇటీవల నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదిక ఈ రాష్ట్రంలో 5000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసామని అంకెల గారి ప్రకటన చేసి రాష్ట్ర విద్యార్థిలో కానీ మోసం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలలోనే చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని నారా లోకేష్ గారి ఉత్తర్వులను ఏమాత్రం ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాల యాజమాన్యాలు పట్టించుకోవడంలేదని అన్నారు. సర్టిఫికెట్ లేని కారణంగా విద్యార్థులకు ఉన్నత చదువులకు అదేవిధంగా ఉద్యోగాల అవకాశాలకు దూరమవుతున్నారని, ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు పోరాటాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కలలు కొంటున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77 వలన వారికి ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించకపోవడం చాలా వరకు పీజీ కళాశాలలు మూతపడడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమవుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయడమని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు సాయి గణేష్, మహేష్,కిరణ్, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష,కార్యదర్శిలు డేవిడ్, అమర్నాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
సూర్య నాయక్