గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి
గుంటూరు రూరల్, మేజర్ న్యూస్:
గుంటూరు రూరల్ మండలం అధ్యక్షులుగా వాకా సీతా మహాలక్ష్మి (ఓబులనాయుడుపాలెం) ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా లాలుపురం ఎంపీటీసీ కాటూరి శ్రీనివాసరావు (మాస్టారు) ఎన్నుకున్నారు. మొత్తం 8 మంది ఎంపీటీసీలు కాగా మొత్తం కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయింది. ఈ నేపథ్యంలో వారి ఎన్నికను ఏకగ్రీవం అయినట్లు ఆర్వో రత్నావతి ప్రకటించారు. అనంతరం వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం ఎంపీటీసీల్లో టిడిపి 4, జనసేన 2, వైయస్సార్ సిపి 2 ఉన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో మందిరంలోకి కేవలం సభ్యులను, విలేకరులను మాత్రమే అనుమతించారు. నల్లపాడు ఎస్సై మధు పవన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియ అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ లను రూరల్ మండలం జడ్పిటిసి చింతా సాంబశివరావు (శివ) కూటమి నాయకులు కల్లూరి శ్రీనివాసరావు, గంధం సురేష్, వాకా సుధాకర్, లీలా మల్లేశ్వరరావు, కల్లూరి అవినాష్, ఉప్పు వెంకట రత్తయ్య, డేగల లక్ష్మణ్, వెంకట్, సూరిబాబు తదితరులు శాలువాలు, పుష్పగుచ్చాలతో అభినందించారు.
ఆళ్ళ వీరభద్రరావు, సీనియర్ జర్నలిస్ట్