వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలోని వాసిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి నామినేషన్ దాఖలు చేశారు.ఆత్మకూరు రూరల్ మండలంలోని వాసిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి పలువురు నాయకులతో కలిసివెళ్లి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ విజయాన్ని ఆకాంక్షించారు.
వాసిలి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజాసేవకు ముందడుగు వేస్తున్న సుంకర పెంచల చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.