BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్..

Select Suryaa Now
యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్..

కళ్యాణదుర్గం పట్టణంలోని స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డి. సోమశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘డ్రగ్స్ వద్దు.. భవిష్యత్తు ముద్దు’ అనే నినాదాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరించాలని సూచించారు. తాత్కాలిక ఆనందం కోసం మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాంతం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నేటి యువతలో కొందరు మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భావి భారత పౌరులైన విద్యార్థులు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండటమే కాకుండా, తమ చుట్టుపక్కల వారిని సైతం వాటి బారిన పడకుండా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని వివరించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్యార్థి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ టి. రామలింగప్ప, ఏఓ వి. నరేంద్ర గౌడ్, డైట్ ప్రిన్సిపాల్ ఎం. బాబా షామీర్, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమేష్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. పోలక్క, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్లు ఐ. పీరునాయక్, ఇమ్రాన్ బాషా, కానిస్టేబుళ్లు ప్రతాప్, నరసరాజు తదితరులు పాల్గొన్నారు.