andhrapradesh
నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు ఈనెల 21వ తేదీ నుంచి 23 తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ బొర్రా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన 24వ తేదీ ఉదయం గం.8.00 నుంచి ఉంటుందన్నారు. ఏవైనా తిరస్కరణకు గురైన నామినేషన్ల అప్పీళ్లకు 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉందన్నారు. అనంతరం అదే రోజు తుది జాబితా ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ నెల రెండవ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన ఉంటుందన్నారు. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ కేంద్రాలు వరుసగా:
సజ్జావారిపాలెం పంచాయితీలో పమిడిమర్రు, సజ్జావారిపాలెం గ్రామాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. అల్లపర్రు పంచాయితీలో అల్లపర్రు, ఉల్లిపాలెం గ్రామస్తులు, ఈదుపల్లి పంచాయితీలో మీసాలవారిపాలెం, ఈదుపల్లి, తాడివాకవారిపాలెం గ్రామస్తులు, పెదమట్లపూడి పంచాయితీలో పెదమట్లపూడి, చినమట్లపూడి గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. ధూళిపూడి (ఉత్తరం) పంచాయితీలో ధూళిపూడి (ఉత్తరం), అద్డంకివారిపాలెం, ధూళిపూడి (దక్షిణం), కొలగానివారిపాలెం, వెనిగళ్లవారిపాలెం గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. మంత్రిపాలెం పంచాయితీలో మంత్రిపాలెం గ్రామస్తులు, పూడివాడ పంచాయితీలో సిరిపూడి, పూడివాడ గ్రామస్తులు, పెద్దవరం పంచాయితీలో పెద్దవరం, జిలేపల్లి, తోటపల్లి గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. ఏలేటిపాలెం పంచాయితీలో ఏలేటిపాలెం, బోరమాదిగపల్లి, న్యూ అంబేద్కర్ నగర్, చిరకాలవారిపాలెం, బెల్లంవారిపాలెం గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. పెదపల్లి పంచాయితీలో పెదపల్లి గ్రామస్తులు, నగరం పంచాయితీలో నగరం గ్రామస్తులు నామినేషన్లు దాఖలు చేయాలని శ్రీనివాసరావు తెలిపారు.