BREAKING
ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్ కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సావిత్రమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి. డాక్టర్ తలారి రంగయ్య. ప్రభుత్వంలో విలీనంతో సమస్యలు..! -పొయ్యిలో పడ్డ ఆర్టీసీ ఉద్యోగులు..!! ఆత్మకూరు జడ్పిటిసి మెంబర్ డాక్టర్ తూమాటి ప్రమాణ స్వీకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నెల్లూరు అభివృద్ధికి శ్రీకారం: మంత్రి నారాయణ. గౌరసంద్ర మారెమ్మకు వెండి కిరీటం బహుకరణ! నిరసనకారులు, జర్నలిస్టులపై దాడులు.. 61 ఘటనలను గుర్తించిన అమ్నెస్టీ! చిప్స్ లో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మానవత్వమే మతంగా పేదల కర్మకాండలకు "కంచి" 70,000ఆర్థిక సాయం లబ్దిదారులకు చేయÖత పెన్షన్ మంజూరు పత్రాల అందజేత దేపూరు లో ఘనంగా సీత సమేత శ్రీకోదండరామ స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం మదనపల్లెలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతి : హాజరైన ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్.కె బాషా

ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్

Select Suryaa Now
ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్

 గుంటూరు: ప్రజాదర్బార్ ప్రజల గుండెచప్పుడు వినే గొప్ప వేదిక అని, రాష్ట్రంలో త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. శుక్రవారం స్థానిక తూర్పు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉంటామని తెలిపారు. ప్రజాదర్బార్ కు వెళితే తమ సమస్యలు పరిష్కరించేందుకు భరోసా నిలుస్తుందనే నమ్మకం కలిగించామని చెప్పారు. తమ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎక్కువగా పింఛన్లు, ఇంటి స్థలాలు, శానిటేషన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చాయని, సంబంధిత అధికారులకు అర్జీలను పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని చెప్పారు. పింఛన్ల కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే అర్హులైన వారిని గుర్తించామన్నారు. అర్హులైన ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గుంటూరు నగరంలో మరింత అభివృద్ధి సాధించే విధంగా పటిష్ట ప్రణాళిక రూపొందించ బోతున్నామని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూలేని విధంగా అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సుమారు రూ.4000 కోట్లు వెచ్చించామన్నారు. మురుగు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతర్గత రోడ్లను సైతం సీసీలుగా తీర్చిదిద్దుతున్నామని, గత వైసీపీలో గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కేవలం రోడ్లనే కాకుండా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.

సూర్య నాయక్