రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్
దుద్యాల, మేజర్ న్యూస్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ అన్నారు. శుక్రవారం దుద్యాల్ రైతు వేదికలో కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య తో కలిసి వరి కొనుగోలు కేంద్రాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాటిని అందరూ సద్వినియోగపరచుకుని దాన్య విక్రయం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మెరుగు శ్రీకాంత్, గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, PACS డైరక్టర్ ఖలీల్ పాషా, వార్డు సభ్యులు ప్రభాకర్, చెన్ను,కాశప్ప గ్రామస్తులు సత్యం, పాండు, హనుమంతు, రమేష్, సాయిలు, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.