మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్ష విధించిన తిరుపతి కోర్టు
రేణిగుంట మేజర్ న్యూస్: మద్యం సేవించి లారీ నడిపిన కేసులో డ్రైవర్‌కు తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ జి. వెంకటరెడ్డి (65) నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రేణిగుంట అర్బన్ సీఐ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.