గుంతల మయంగా ఉన్న రోడ్లను వారంలోగా మరమ్మతు చేయాలి : కలెక్టర్ పి రాజబాబు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :స్థానిక కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ, గ్రామీణ నీటి సరఫరా , ఆర్టీవో అధికారులతో పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటిని అందజేయాలని ప్రజలలో దీనిపై ఉన్న వ్యతిరేక భావం భావం పోయే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ రిపోర్టర్లు సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని, ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. డివిజన్లు వారీగా సమీక్ష నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో సుశీల, రోడ్లు భవనాల శాఖ గ్రామీణ సరఫరా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.