వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం, మేజర్‌న్యూస్ :వెలిగొండ ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామస్థుల సమస్యలు పూర్తి స్థాయిలో సత్వరం పరిష్కరించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దారులు, జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలెక్టరేట్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందనివారికి వీలైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2లో భూసేకరణకు సంబంధించిన పెండింగ్ పనులు, పునరావాస కాలనీల్లో మిగిలిపోయిన పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, జలవనరుల శాఖ అధికారులు, వీఆర్వోలు పాల్గొన్నారు.