తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు
తూప్రాన్ : తూప్రాన్ గీతా స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది విద్యార్థులు పాఠశాల మైదానంలో "చాచాజీ "ఆకారంలో కూర్చుని చా చా నెహ్రూ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. నెహ్రూజీ కి బాలల పట్ల ఉన్న ప్రేమానురాగాలను ప్రిన్సిపాల్ అరుణ విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష డైరెక్టర్లు రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
( రామస్వామి తూప్రాన్ మండల రిపోర్టర్)