BREAKING
పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

*యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు.

Select Suryaa Now
*యువతను వేధిస్తున్న మధుమేహం*  *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు.

 

మధుమేహం (షుగర్ వ్యాధి) గతంలో మేము వయసు పెరిగిన వారిలో మాత్రమే చేసే వాళ్లం. కానీ ఇప్పుడు యువతలో ఎక్కువగా చూస్తున్నం. నేడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎంతోమందిని వేధిస్తోంది. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ వ్యాధి ముప్పును పెంచుతున్నాయి. అయితే ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ప్రజల్లో అవగాహన తీసుకరావడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 
తరచూ దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, విపరీతమైన ఆకలి, నీరసం, చూపు మసకబారడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి. కుటుంబంలో మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, శారీరక శ్రమ లేనివారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఇటీవల కాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఎక్కువగా ఖర్చు చేయలేకపోతున్నాం. దీంతో మధుమేహం వ్యాధి పెరుగుతుందని గణంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుండే పని చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ఈ ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయి.

నియంత్రణలో లేని మధుమేహం గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, బరువును అదుపులో ఉంచుకోవడం, వైద్యుల సూచన మేరకు మందులు వాడటం అవసరం. క్రమం తప్పకుండా షుగర్‌, హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే గుర్తించడం.. సకాలంలో చికిత్స తీసుకోవడమే మధుమేహ సమస్యల నుంచి రక్షణ పొందడానికి కీలకమని ఆయన సూచించారు.