సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం మూడవ రోడ్డులోని సాయి విజ్ఞాన్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం.పి. శ్రీనివాసులు మాట్లాడుతూ నవంబర్ 14న నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. మరో డైరెక్టర్ సి. కరుణాకర్ బాబు మాట్లాడుతూ.. పిల్లలపై నెహ్రూకు ఉన్న ప్రేమను వివరించారు. ప్రధానోపాధ్యాయులు జి. లావణ్య రామ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
విద్యార్థులు నెహ్రూ వేషధారణలో అలరించగా, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ సామాజిక అంశాలపై విద్యార్థులు ప్రసంగించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, చివరగా చాక్లెట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. వేడుకలను చక్కగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..