BREAKING
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్ష విధించిన తిరుపతి కోర్టు ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ సర్పంచ్ ఎన్నికలపై నంద్యాల మండల టీడీపీ నేతలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సమీక్ష గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే భారీ ప్రోత్సాహకాలు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు: రూ.1.14 లక్షల కోట్ల విలువైన 12 కీలక ఒప్పందాలు బత్తలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ సర్కార్ బంపరాఫర్ రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Select Suryaa Now
జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

యాలాల, మేజర్ న్యూస్: జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, యువత ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, గ్రామ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.శుక్రవారం యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, విద్యా ప్రగతి, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు పౌష్టికాహారం అందించేందుకు అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థుల కోసం చేసే ఖర్చు భావితరాల భవిష్యత్తు కోసం పెట్టే గొప్ప పెట్టుబడి అని పేర్కొన్నారు.రెండో భద్రాద్రిగా పేరొందిన జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి సుమారు రూ.20 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలో తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. జుంటుపల్లి పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అలాగే జుంటుపల్లి ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడించారు.యువత ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.5.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జిమ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామంలో విద్య, దేవాలయ అభివృద్ధి, మౌలిక వసతులతో పాటు యువత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, యాలాల సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, జుంటుపల్లి సర్పంచ్ వాణిశ్రీ రమేష్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, యాలాల తహసీల్దార్ గాయత్రి, ఎంపీవో శ్రీనివాస్, ఎంఈఓ, ఉపసర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.