BREAKING
మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్‌కు 10 రోజుల జైలు శిక్ష విధించిన తిరుపతి కోర్టు ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ సర్పంచ్ ఎన్నికలపై నంద్యాల మండల టీడీపీ నేతలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సమీక్ష గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే భారీ ప్రోత్సాహకాలు-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు: రూ.1.14 లక్షల కోట్ల విలువైన 12 కీలక ఒప్పందాలు బత్తలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ సర్కార్ బంపరాఫర్ రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవుటి శేఖర్ జుంటుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి

నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు*

Select Suryaa Now
నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి  *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు*

నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి

*పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు*

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాస నగర్‌లో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగుపుట్టకు, జంట నాగులకు పాలు పోసి భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు చేశారు.

ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే వల్లి, దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం. హిందూ సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని నాగదోష నివారణ, కుజదోష నివారణ, సంతాన ప్రాప్తి కోసం ఆరాధించడం విశేష విశ్వాసంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నాగులచవితి రోజున స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

నాగారాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఆలయ పూజారి తంగిరాల విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగులచవితి వేడుకలతో శ్రీనివాస నగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేక ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచింది.