andhrapradesh
బత్తలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బత్తలపల్లి: బత్తలపల్లి గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక. రేపు అనగా 14/11/2026 (శనివారం) నాడు విద్యుత్ లైన్లలో అత్యవసర మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 09:00 గంటల నుండి సాయంకాలం 04:00 గంటల వరకు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ. (AE) శివయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమయంలో గృహ మరియు వాణిజ్య అవసరాలకు కరెంటు సరఫరా ఉండదని, కావున గ్రామ ప్రజలు మరియు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.