BREAKING
ప్రముఖ హాలీవుడ్ రాపర్ యంగ్ ఎల్ అకస్మిక మృతి.. దిగ్భ్రాంతిలో సంగీత ప్రపంచం ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం: కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప రిపోర్టింగ్ లైవ్ చిత్రంలో పరిణీతి చోప్రా ఎంపికపై దర్శకుడు ధ్రువ్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు సాయి విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు *యువతను వేధిస్తున్న మధుమేహం* *డాక్టర్‌ సి. గోపీనాథ్‌ రెడ్డి* హెచ్‌ఓడీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, కర్నూలు. పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన పోతినవారిపాలెంలో 179 వ నేత్ర దానం టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత

విద్యార్థుల పట్ల సంబంధిత శాఖ అధికారులు నైతిక బాధ్యత తో వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ పి. రాజబాబు

Select Suryaa Now
విద్యార్థుల పట్ల సంబంధిత  శాఖ అధికారులు నైతిక బాధ్యత తో వ్యవహరించాలి :  జిల్లా కలెక్టర్ పి. రాజబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

 వివిధ శాఖల సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల సంబంధిత  శాఖ అధికారులు నైతిక బాధ్యత తో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
    శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారులతో పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్ పై( పి పి పి) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని అదేవిధంగా త్రాగునీరు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు.  సమస్యలు ఉన్నచోట సంబంధిత అధికారులకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. విద్యాలయాలలో బోధన సామర్థ్యం పెంచాలని దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సానుకూల దృక్పథం ఉండేలా చూడాలన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సంతృప్తి స్థాయి 80 నుంచి 90 శాతానికి పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.  గిరిజన సంక్షేమ వసతి గృహాలలో కూడా బోధన సామర్థ్యం పెంపొందించడంతోపాటు మంచినీరు సరైన భోజనం ఏర్పాటు చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నది తెలుసుకునే విధంగా ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రోజు ఎంతమంది పిల్లలు వస్తున్నారు తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలన్నారు .       ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ .లక్ష్మ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారిని వరలక్ష్మి మరియు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు