ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం
మునుగోడు,మేజర్ న్యూస్:ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మందుల బీరప్ప అన్నారు.శుక్రవారం మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన చక్రం శీను పక్షవాతంతో మంచానికే పరిమితం అయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆయన మానవతా దృక్పథంతో ముందుకొచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పేదరికంతో బాధపడుతున్న చక్రం శీను భార్య కూడా అనారోగ్యంతో ఉండటం చాలా బాధాకరమన్నారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటునని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మందుల బీరప్ప సేవాభావం అభినందనీయం పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు.
కె ఇంద్రసేనారెడ్డి మేజర్ న్యూస్ మునుగోడు, నల్గొండ జిల్లా.