BREAKING
పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన

Select Suryaa Now
పంటల నష్టంపై కేంద్ర బృందం పరిశీలన

బాపట్ల, మేజర్ న్యూస్ : ఈ నెల 3న సంభవించిన 'మురసు' తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా , రోడ్లు-భవనాలు ), పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలకు jఅరిగిన నష్ట వివరాలతో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు.

ఈ పరిశీలన బృందంలో కేంద్ర సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ ఆర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ , విద్యుత్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్ పాల్గొన్నారు.

వీరితో పాటు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఇంచార్జి డీఆర్వో లవన్న , వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని తుఫాన్ వల్ల జరిగిన ఆస్తి, పంట నష్టాల తీవ్రతను కేంద్ర బృందానికి క్షుణ్ణంగా వివరించారు.