రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ సంస్థలతో జరిగిన అవగాహన ఒప్పందం
విశాఖపట్నం, మేజర్‌న్యూస్ :
విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా, రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ సంస్థలతో జరిగిన అవగాహన ఒప్పందాల (MoUs) సంతకాల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, పొంగూరు నారాయణ గార్లతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో మొత్తం రూ.9,214.5 కోట్ల పెట్టుబడులు రానుండగా, తద్వారా 5,847 మందికి ప్రత్యక్షంగా, 14,048 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ (KSPL), ఏజిస్ వోపాక్ టెర్మినల్స్ లిమిటెడ్ (AVTL), సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC), ఇండెవ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఏజిస్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్స్ అండ్ లాజిస్టిక్స్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి మరియు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని దామచర్ల సత్య గారు పేర్కొన్నారు.