జడ్పిటిసి, ఎంపీటీసీ లను అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం రూరల్ జడ్పీటీసీ, ఎంపీటీసీలను అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :
అనంతపురం రూరల్ మండలంలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ అభినందనలు తెలియజేశారు.ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తులతో కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి అభినందించారు.ప్రజలు అందించిన ఆదరణకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.