మీసేవ కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారుల తనిఖీలు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లా గౌరవ జిల్లా స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు అధికారి శ్రీ *M. వెంకటేశ్వరరావు గారు, మీసేవ జిల్లా ఇన్‌చార్జ్ మేనేజర్ శ్రీ **A. శ్రీనివాసరావు గారితో* కలిసి శుక్రవారం ఒంగోలు పట్టణ పరిధిలోని మీసేవ కేంద్రాలను సంయుక్తంగా తనిఖీ చేశారు.
????ఈ తనిఖీలలో భాగంగా నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి, ఫ్రాంచైజీ నిర్వాహకులు శ్రీ *K. శేషారావు* గారితో పాటు కేంద్రానికి వచ్చిన వినియోగదారులతో మాట్లాడారు.
????ఈ సందర్భంగా వినియోగదారులకు అందుతున్న సేవలు, వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన రుసుములు, సేవల నిర్వహణ విధానం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలోని రికార్డులు, సేవల పారదర్శకత మరియు ప్రజలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
???? మీసేవ కేంద్రాలను గౌరవ జాయింట్ కలెక్టర్ వారి ఉత్తర్వుల ప్రకారం మీకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు
???? ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ...
???? ప్రతి మీసేవ VLE మరియు ఫ్రాంచైజీ నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను పాటిస్తూ కేంద్రాలను నిర్వహించాలి.
???? ప్రభుత్వము నిర్ణయించిన రుసుములనే వినియోగదారుల నుంచి వసూలు చేయాలి.
???? ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక రుసుములు వసూలు చేయరాదు.
???? వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పారదర్శకమైన సేవలు అందించాలి.
???? అధిక రుసుములు వసూలు చేసినట్లు లేదా సేవలందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.
???? మీసేవ నిర్వాహకులకు జిల్లా స్థాయి సమావేశం
????అలాగే, ప్రకాశం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులందరికీ మీసేవ నియమ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు సేవల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు *జిల్లా స్థాయి సమావేశం* నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
???? *తేదీ: 17-11-2026, మంగళవారం*
⏰ *సమయం: ఉదయం 10:00 గంటలకు*
???? *వేదిక: PGRS హాల్, ప్రకాశం జిల్లా కలెక్టరేట్, ఒంగోలు.*
ఈ సమావేశానికి జిల్లాలోని ప్రతి ఒక్క మీసేవ VLE మరియు ఫ్రాంచైజీ నిర్వాహకులు తప్పనిసరిగా హాజరై, సమావేశంలో తెలియజేసే నియమ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని అధికారులు ఆదేశించారు.
*ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా మీసేవ కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.