BREAKING
పోతినవారిపాలెంలో 179 వ నేత్రదానము టీమిండియా ఘోర పరాజయం.. 244 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జయభేరి మౌళి ‘దొంగ నా కొడుకు’ (డీఎన్‌కే) మూవీ రివ్యూ.. లిటిల్ హార్ట్స్ హీరో మరో హిట్ కొట్టాడా? గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు గుంతల మయంగా ఉన్న రోడ్లను గుంతలు పూడ్చి వారం రోజు లోపల తగిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పి రాజబాబు అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు వివాదాల తర్వాత వెండితెరపైకి జానీ డెప్ రీఎంట్రీ.. ఎబెనెజర్ సినిమాతో మళ్లీ హాలీవుడ్‌ను ఏలుతారా? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ విజయ సునీత పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. జెసి, ఎస్పి విరిగిన ఐదు పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయం.. ఐసీయూలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన సలార్ నటుడు టిన్ను ఆనంద్ రామాయణ బాక్సాఫీస్ సునామీ.. బాహుబలి 2, యానిమల్, పఠాన్ రికార్డ్స్ ధ్వంసం తుఫాన్ ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు జడ్పిటిసి, ఎంపీటీసీ లను అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత మీసేవ కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారుల తనిఖీలు

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్

Select Suryaa Now
ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సేవలు అభినందనీయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్

విజయవాడ, మేజర్‌న్యూస్‌ :

మురసు తీవ్ర తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని  ఎనిమిది మంది సభ్యుల అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం (IMCT) శుక్రవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈఓ ప్రఖర్ జైన్ కేంద్ర బృందానికి తుపాను తీవ్రత, రాష్ట్రంలో జరిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సన్నద్ధత, సహాయక, పునరుద్ధరణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ... మురసు తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను అభినందించారు.

సహాయక చర్యలు అభినందనీయం:

తుపాను సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఎంతో శ్రమించి సహాయక చర్యలు చేపట్టాయని, ఆస్తి నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రాణనష్టాన్ని నివారించేందుకు తీవ్రంగా కృషి చేశాయని ప్రశంసించారు. విపత్తు సమయంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది చూపిన అంకితభావం అభినందనీయమన్నారు.

సత్వర పునరుద్ధరణ ప్రశంసనీయం:

తుపాను ప్రభావం అనంతరం కేవలం రెండు రోజుల్లోనే విద్యుత్ సరఫరా, మొబైల్ కనెక్టివిటీ, రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. దీనివల్ల ప్రజల సాధారణ జీవనంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు త్వరగా పునఃప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

సహకార సమాఖ్య విధానానికి నిదర్శనం:

ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభ సమయాల్లో వివిధ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ఒకరికొకరు అండగా నిలవడం భారతదేశంలోని సహకార సమాఖ్య విధానానికి (Cooperative Federalism) నిదర్శనమని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయడం ఎంతో ముఖ్యమన్నారు.

తుపాను తీవ్రత – ముందస్తు సన్నద్ధత:

అర్నబ్ తుపానుకు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో మురసు తీవ్ర తుపాను రాష్ట్రంపై ప్రభావం చూపిందని  ప్రఖర్ జైన్ కేంద్ర బృందానికి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) నిరంతర పర్యవేక్షణ ద్వారా తుపాను తీరం దాటే ప్రాంతం, సమయాన్ని ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను, సిబ్బందిని ముందుగానే అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. వరుసగా విపత్తులు ఎదురైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు వేగంగా సహాయక చర్యలు అందించిందని పేర్కొన్నారు. 'మన మిత్ర' వాట్సాప్ సేవలు, విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు సహాయం అందించినట్లు తెలిపారు. తుపాను సమయంలో రహదారులపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధప్రాతిపదికన తొలగించి రాకపోకలను వేగంగా పునరుద్ధరించినట్లు వివరించారు.

ప్రభావిత ప్రాంతాలు – సహాయక చర్యలు:

మురసు తుపాను కారణంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 106 మండలాలు, 315 గ్రామాలు, 746 గ్రామాలు/పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రజలు ప్రభావితమైనట్లు వివరించారు. ఈ తుపాను కారణంగా మొత్తం 1,93,769 మంది ప్రభావితం కాగా, ప్రభుత్వం 536 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 31,080 మందికి సురక్షిత ఆశ్రయం కల్పించిందన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 3,066 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు 253 వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. మత్స్యకారులకు చెందిన 12,967 ఫిషింగ్ బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా ఒడ్డునే ఉండేలా చర్యలు తీసుకున్నామని, 8 జిల్లాల్లో 13 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని వివరించారు.

వ్యవసాయం, ఇతర రంగాలకు జరిగిన నష్టం:

మురసు తుపాను కారణంగా సుమారు 1.86 లక్షల మంది రైతులకు చెందిన 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అలాగే 3,859 ఇళ్లు, 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు.

శాఖల వారీగా ప్రాథమిక నష్టం అంచనాలు:

- ఆర్‌అండ్‌బీ శాఖ – రూ.889 కోట్లు
- వ్యవసాయ శాఖ – రూ.875 కోట్లు
- ఉద్యానవన శాఖ – రూ.337 కోట్లు
- నీటిపారుదల శాఖ – రూ.136 కోట్లు
- పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ – రూ.119 కోట్లు
- విద్యుత్ శాఖ – రూ.54 కోట్లు

మొత్తంగా మురసు తుపాను కారణంగా రూ.2,484.43 కోట్ల మేర ప్రాథమిక నష్టం వాటిల్లినట్లు (2026 నవంబర్ 12 నాటికి) కేంద్ర బృందానికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏపిఎస్డీఎంఏ ఈడి కౌసర్ బానో, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం రెండు బృందాలుగా ఏర్పడి  బాపట్ల, ఏలూరు జిల్లాల పర్యటనకు వెళ్లారు. రేపు పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో బృందాలు పర్యటించనున్నాయి.

కేంద్ర పరిశీలనా బృందం సభ్యులు:

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

1. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ – ఏడీసీ ప్రశాంత్ ఆర్మోరికర్.
2. జల వనరుల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) – సూపరింటెండింగ్ ఇంజనీర్ రేఖారాణి కొల్లు.
3. ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యయ విభాగం – అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్.
4. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శశాంక్ శేఖర్ రాయ్.
5. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ – డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్.
6. విద్యుత్ మంత్రిత్వ శాఖ – డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్.
7. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇస్రో – సైంటిస్ట్ 'SF' డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ.

తుపాను వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివిధ శాఖల నుంచి సమగ్ర వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు కేంద్ర బృందం వెల్లడించింది.