BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

శబరిమల భక్తులకు రైల్వే శాఖ తీపికబురు..నేటి నుంచే 54 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు షురూ..

Select Suryaa Now
శబరిమల భక్తులకు రైల్వే శాఖ తీపికబురు..నేటి నుంచే 54 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు షురూ..

సికింద్రాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. మండల, మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 54 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్ల ప్రక్రియ నేడు (నవంబర్ 13) ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైంది. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల (నవంబర్ 2026) నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లాం మధ్య ఈ 54 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఇందులో చర్లపల్లి – కొల్లాం మధ్య నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా అత్యధికంగా 38 సర్వీసులు, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా 6 సర్వీసులు నడవనున్నాయి. అలాగే హైదరాబాద్ – కొల్లాం మధ్య 8 సర్వీసులు, నాందేడ్ – కొల్లాం/చర్లపల్లి మధ్య 2 ప్రత్యేక సర్వీసులను కేటాయించారు.

శబరిమలకు సమీప గేట్‌వే స్టేషన్లయిన కొట్టాయం, చెంగన్నూర్‌లలో ఈ అన్ని ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పించడం వల్ల భక్తులకు ప్రయాణ సమయంతో పాటు రవాణా వ్యయం ఆదా కానుంది. కొన్ని రైళ్లలో 1AC, 2AC, 3AC బోగీలు మాత్రమే అందుబాటులో ఉండగా, మరికొన్నింటిలో స్లీపర్, జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు. అయ్యప్ప భక్తులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.