BREAKING
పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీని గెలిపించండి శర్వాణిలో ఘనంగా బాలల దినోత్సవం... అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ రామాయణ బాక్సాఫీస్ జోరు.. తొమ్మిదో రోజు రూ.600 కోట్ల క్లబ్‌లోకి రణబీర్ కపూర్, యశ్ చిత్రం! వైభవంగా వీరన్న స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు కూకట్‌పల్లి – మూసాపేట ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు!మాజీ మంత్రి హరీష్ రావు, మాధవరం కృష్ణారావు నేటి నుండి కోటిదీపోత్సవం నగరంలోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా ... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సైలాడ సతీష్ ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ

రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

వెల్దుర్తి (మేజర్ న్యూస్), : ఏలూరు జిల్లా పెదవేగిలో శని, ఆదివారాల్లో (ఈ నెల 14, 15 తేదీల్లో) జరగనున్న రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు వెల్దుర్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు.గురుకులంలో పదో తరగతి చదువుతున్న జి. యశస్విని (400 మీటర్ల పరుగు), ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) విద్యార్థిని ఇ. జ్యోత్స్న బాయి (100 మీటర్ల పరుగు) విభాగాల్లో కర్నూలు జిల్లా జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో తలపడనున్నారు. వీరు జిల్లా జట్టుతో కలిసి ఏలూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు.  రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణులను గురుకుల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ) మరియు అధ్యాపక బృందం అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.