జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు
నరసన్నపేట నవంబర్ 14 మేజర్ న్యూస్ : యోగద చారిటబుల్ ట్రస్ట్, గుంటూరు (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలలో పోలాకి మండలం పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస మోడల్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతులు సాధించారు.
“యువ భారతం – ప్రగతిశీల భారతం (Young India – Progressive India)” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీలలో సీనియర్ విభాగంలో 9వ తరగతి విద్యార్థిని ch. శ్రీవల్లి, జూనియర్ విభాగంలో 7వ తరగతి విద్యార్థిని ch. కృషిత ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్నారు.
విద్యార్థినులు తమ సృజనాత్మకత, ఆలోచనా శక్తి, కళాత్మక నైపుణ్యంతో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ పి. ప్రవీణ , ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలు పాఠశాలకు గర్వకారణమని పేర్కొంటూ విద్యార్థినులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
విద్యార్థినుల విజయానికి సహకరించిన మార్గదర్శక ఉపాధ్యాయులు జె. కృష్ణారావును కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
బి.గోపాలకృష్ణ ( నరసన్నపేట)