telangana
అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ
సుర్యవేల్పూరు :వేల్పూర్ మండలం అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బాలసభ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మల్లేశ్వరి ఆధ్వర్యంలో, బాలసభ ఇన్‌చార్జి యమునా మేడం సమక్షంలో నిర్వహించారు.జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోగా, బాలరాజు పియానో వాయించి అలరించారు. రక్షిత్ ఉపన్యాసం ఆకట్టుకుంది. ఆరవ తరగతి విద్యార్థులు వివిధ రకాల పిరమిడ్లు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. పదో తరగతి విద్యార్థినులు హారిక, స్నేహిత చక్కటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం ఎస్-1 పరీక్షల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వివిధ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వేణుగోపాల్ రెడ్డి కంపాస్ కిట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సదాశి, వినోద్, దేవరాజ్, రాజేంద్ర, శ్రీలక్ష్మి, శ్రీదేవి, యమునా, పీడీ దేవ, సుకన్య, జాన్సన్, వేణుగోపాల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.