ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి
సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూల హామీ
హైదరాబాద్: ఎంఎల్‌హెచ్‌పీ (MLHP) పోస్టుల నియామక అర్హతల్లో హోమియోపతి, నేచురోపతి, యునానీ వైద్యులకు సైతం అవకాశం కల్పించాలని తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివప్రసాద్ కోరారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయుష్ వైద్యులు ఎదుర్కొంటున్న అర్హతల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీలో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు.
ఎంఎల్‌హెచ్‌పీ నియామకాల్లో ఆయుష్ వైద్యులకు సముచిత అవకాశం కల్పించి, వారికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.