telangana
ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు
సూర్య వేల్పూరు :వేల్పూర్ మండలం కుకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ వివిధ తరగతులకు వెళ్లి పాఠ్యాంశాలను బోధించారు. మణిదీప్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించగా, ఇతర విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు బోధనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఉపాధ్యాయుల బాధ్యతల గురించి ప్రత్యక్ష అనుభవం పొందారు.ఉత్తమంగా బోధించిన ఐదుగురు విద్యార్థులు మణిదీప్, జాగృతి, ద్వారకామయి, సాయిశ్రీ, అఖిలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. హరిచరణ్ ప్రత్యేక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పెన్నులు బహూకరించారు.ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ పతాని గంగాధర్, శ్రీధర్ రావు, మల్కన్న, చరణ్ దాస్, రవీందర్, నాగరాజు, అశోక్, హరిత, భారతి తదితరులు పాల్గొన్నారు.