BREAKING
పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీని గెలిపించండి శర్వాణిలో ఘనంగా బాలల దినోత్సవం... అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న కర్నూలు జిల్లా కలెక్టర్ రామాయణ బాక్సాఫీస్ జోరు.. తొమ్మిదో రోజు రూ.600 కోట్ల క్లబ్‌లోకి రణబీర్ కపూర్, యశ్ చిత్రం! వైభవంగా వీరన్న స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు కూకట్‌పల్లి – మూసాపేట ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు!మాజీ మంత్రి హరీష్ రావు, మాధవరం కృష్ణారావు నేటి నుండి కోటిదీపోత్సవం నగరంలోని ఎన్ టీ ఆర్ స్టేడియం వేదికగా ... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సైలాడ సతీష్ ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ

గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

Select Suryaa Now
గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

 మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్టీపీ నీటి సరఫరా
 శుద్ధి జలాల వినియోగానికి ముందుకొచ్చిన తొలి సంస్థగా వాసవి గ్రూప్
మూడు ఎస్టీపీల నుంచి రోజుకు 56 లక్షల లీటర్ల తృతీయ శుద్ధి జలాలు అందుబాటులోకి
 నిర్మాణ అవసరాలకు తాగునీరు, భూగర్భ జలాలను వినియోగించవద్దు: కమిషనర్

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి);హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జలమండలి చేపట్టిన డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ కార్యక్రమం నిర్మాణ రంగానికి విస్తరించింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్టీపీల్లో తృతీయ దశలో శుద్ధి చేసిన నీటిని వినియోగించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాంగణంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుద్ధి జలాలను వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థగా వాసవి గ్రూప్ నిలిచింది.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా టెర్షియరీ శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. అన్ని నిర్మాణ సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముందుకొచ్చిన వాసవి గ్రూప్‌ను అభినందించారు.

జలమండలి మల్కాజిగిరి రీజియన్ ఈడీ ఎస్. పంకజ మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంగణాల్లో కాంక్రీట్ క్యూరింగ్, దుమ్ము నియంత్రణ, శుభ్రపరిచే పనులకు మాత్రమే శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. శుద్ధి జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీ ఏసీపీలు, జలమండలి డీజీఎంలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

*మూడు ఎస్టీపీల నుంచి 56 లక్షల లీటర్లు:*
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ (2.50 ఎంఎల్‌డీ), పటేల్ చెరువు (2.50 ఎంఎల్‌డీ), సఫిల్‌గూడ (0.60 ఎంఎల్‌డీ) ఎస్టీపీల నుంచి రోజుకు మొత్తం 5.60 ఎంఎల్‌డీ (56 లక్షల లీటర్లు) టెర్షియరీ శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నీటిని జలమండలి ఉచితంగా అందిస్తుందని, వినియోగదారులు రవాణా ఖర్చులు మాత్రమే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలు తమ సొంత ట్యాంకర్లను గ్రీన్ వాటర్ ట్యాంకర్లుగా నమోదు చేసుకోవచ్చని, లేదంటే డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 155313 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ పంకజ, డైరెక్టర్ బి. నారాయణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ, జలమండలి అధికారులు, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.