BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

Select Suryaa Now
ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

                       45 నివాస ప్లాట్ల విక్రయానికి ముందు హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్ సమావేశం

.                               . బిడ్డర్ల సందేహాలకు అధికారుల సమాధానాలు
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):ఇన్ముల్నర్వ లేఅవుట్‌లోని నివాస ప్లాట్ల ఈ-వేలానికి ఔత్సాహిక బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి పలువురు ఆసక్తిగల బిడ్డర్లు హాజరై వేలం ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఇన్ముల్నర్వ లేఅవుట్‌లో మొత్తం 45 నివాస ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో లేఅవుట్ ప్రత్యేకతలు, రవాణా సౌకర్యాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలను అధికారులు వివరించారు.
లేఅవుట్ ప్రత్యేకతలపై కేపీఎంజీ ప్రజెంటేషన్
హెచ్‌ఎండీఏ లావాదేవీల సలహాదారు సంస్థ కేపీఎంజీ ప్రతినిధి కల్యాణ్ ఇన్ముల్నర్వ లేఅవుట్‌కు ఉన్న రవాణా అనుసంధానం, మౌలిక సదుపాయాలు, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి అవకాశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ-వేలంలో పాల్గొనేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నిబంధనలు, విధివిధానాలను ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ప్రతినిధి దినేష్ వివరించారు.
బిడ్డర్ల సందేహాలకు అధికారుల వివరణ
ఈ సందర్భంగా ఔత్సాహిక బిడ్డర్లు అడిగిన పలు ప్రశ్నలకు హెచ్‌ఎండీఏ అధికారులు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా బిడ్డింగ్ ప్రక్రియ, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), చెల్లింపుల నిబంధనలు, లేఅవుట్ అభివృద్ధి ప్రమాణాలపై స్పష్టతనిచ్చారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా నిబంధనలను పూర్తిగా తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ అధికారులు ఈఈ దన్మోహన్ సింగ్, తహసీల్దార్ వై.టి. వెంకటేశ్వర్లు, డీఈఈ అభిలాష్, ఏఈఈ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 23న ఈ-వేలం.. 21తో ముగియనున్న రిజిస్ట్రేషన్
ఇన్ముల్నర్వ లేఅవుట్‌లోని 45 నివాస ప్లాట్లకు సంబంధించిన ఈ-వేలం 2026 నవంబర్ 23న నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు నవంబర్ 21వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలు, సహాయం కోసం ఆసక్తిగల వారు హెచ్‌ఎండీఏ హెల్ప్‌లైన్ నంబర్ 7416835522 ను సంప్రదించవచ్చు. ఈ-వేలం నిబంధనలు, రిజిస్ట్రేషన్, పాల్గొనే విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలను హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ www.hmda.gov.in లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.