BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం 12 ప్రధాన హామీలతో కూడిన ప్రత్యేక సంక్షేమ విధానాన్ని (గిగ్ వర్కర్స్ పాలసీ) రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ పాలసీని ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు.

ఈ చట్టం ద్వారా గిగ్ వర్కర్లందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇది కేవలం నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన చట్టం కాదని, కార్మికుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని రూపొందించినదని ఆయన స్పష్టం చేశారు. నాడు భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చామని పేర్కొన్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒక్కసారి మాట ఇస్తే మట్టిలో కలిసినా మాట తప్పరని ఉద్ఘాటించారు.