BREAKING
బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి మీకు అహంకారమా? నస్లేన్ అదిరిపోయే సమాధానం జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి. ‘రామాయణ’పై డిజైనర్ సుబ్రతా చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు నానా పటేకర్‌తో చివరి క్షణాలను గుర్తుచేసుకున్న మహేష్ మంజ్రేకర్ అభివృద్ధి బాటలో విశాఖ పటౌడీ ప్యాలెస్‌లో కరీనా కపూర్ కుటుంబ వేడుకలు శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ 'రూప' ప్రమోషన్స్‌లో కోమల్ రాణితో గోవిందా సందడి.. మూడు రోజుల లాభాలకు గండి, 460 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రపంచ వేదికపైకి బీహార్ సంస్కృతి: దీఘా ఘాట్‌లో ఘనంగా పూజ వేడుకలు కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు! స్పెయిన్ ఎన్నికల పోరు: ప్రధాని పెడ్రో సాంచెజ్‌కు పెరుగుతున్న ఇబ్బందులు హెచ్‌ఐసీసీలో నేటి నుంచి ‘భారత్ సమ్మిట్-2026’

హెచ్‌ఐసీసీలో నేటి నుంచి ‘భారత్ సమ్మిట్-2026’

Select Suryaa Now
హెచ్‌ఐసీసీలో నేటి నుంచి ‘భారత్ సమ్మిట్-2026’

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి చర్చలు, విధాన నిర్ణయాలకు భాగ్యనగరం మరోసారి వేదికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమ్మిట్-2026’ (రెండో ఎడిషన్) నేడు (నవంబర్ 13) మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. 'ఫోర్జింగ్ ఏ న్యూ వరల్డ్' (సరికొత్త ప్రపంచ నిర్మాణం) నినాదంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి సుమారు 1,000 మందికి పైగా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, దౌత్యవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

సదస్సు తొలి రోజున నేడు వివిధ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో కీలక సమావేశాలు, ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, గ్లోబల్ సౌత్ - గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సహకారం, కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ క్యాపిటలిజం, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై నిపుణులు మేధో మథనం చేస్తున్నారు.

ఈ సదస్సులో తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘తెలంగాణ రైజింగ్’ థీమ్‌తో ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, పట్టణీకరణ, ఆర్థిక-సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు, సహకార సమాఖ్య విధానం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు ప్రసంగించి, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. రేపు (శనివారం) జరిగే ముగింపు వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.