జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి.
ఏలూరు జిల్లా:-జీలుగుమిల్లి, మేజర్ న్యూస్ : జీలుగుమిల్లి మండలంలోని రాచన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జిల్లేలగూడెం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఒక ఎద్దుని చంపి మాంసం తిని వదిలేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. అడవి ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లొద్దని వారు సూచిస్తున్నారు. ఉన్నతాధికారుల స్పందించి ప్రజలకు,పశువులకు భద్రత కల్పించాలని గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు.గడిచిన రెండు నెలల క్రితం జీలుగుమిల్లి మండలంలో సంచరించిన పెద్దపల్లి అభయారణ్యంలోకి వెళ్లినట్లు ఉన్నత అధికారులు వెల్లడించారు. అయితే గత రెండు రోజులుగా పోలవరం నియోజకవర్గంలోని వెలేరుపాడు మండలం కోయిదా గ్రామం పరిధిలో ఆవులను చంపితిన్న పెద్దపులి మరలా జీలుగుమిల్లి మండలానికి చేరుకోవడంతో రైతులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జీలుగుమిల్లి, రిపోర్టర్ బొంతు రామకృష్ణ.