వైఎస్ఆర్సిపి లో చేరిన జనసేన కార్యదర్శి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లారాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జక్కంపూడి రాజా తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసం తో వివిధ పార్టీల నాయ కులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.మైరెడ్డి గంగాధర్ పార్టీలో చేరికతో నరేంద్రపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న రోజు ల్లో మరింత మంది నాయ కులు, కార్యకర్తలు పార్టీ లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.