BREAKING
రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి మీకు అహంకారమా? నస్లేన్ అదిరిపోయే సమాధానం జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి. ‘రామాయణ’పై డిజైనర్ సుబ్రతా చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు నానా పటేకర్‌తో చివరి క్షణాలను గుర్తుచేసుకున్న మహేష్ మంజ్రేకర్ అభివృద్ధి బాటలో విశాఖ పటౌడీ ప్యాలెస్‌లో కరీనా కపూర్ కుటుంబ వేడుకలు శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ 'రూప' ప్రమోషన్స్‌లో కోమల్ రాణితో గోవిందా సందడి.. మూడు రోజుల లాభాలకు గండి, 460 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు!

Select Suryaa Now
కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు!

అమరావతి/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను వరుస తుఫాన్ల భయం వీడటం లేదు. ఇప్పటికే 'అర్నాబ్', 'మురసు' తుఫాన్ల ప్రభావంతో అతలాకుతలమైన కోస్తాంధ్రపై మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు (నవంబర్ 13) అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా, రానున్న 48 గంటల్లో (నవంబర్ 15 నాటికి) అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఈ వాయుగుండం దిశ మార్చుకుని మరింత తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది పూర్తిస్థాయి తుఫాన్‌గా బలపడితే, ఇరాన్ సూచించిన 'అక్వాన్' (Akvan) అనే పేరును దీనికి ఖరారు చేయనున్నారు.

తుఫాన్‌గా బలపడితే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై మరోసారి దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. వాయుగుండం గమనం, తీరం దాటే ప్రాంతంపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.