BREAKING
రేపటి నుండి పొన్నూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ........ పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు నాగులచవితికి ఆధ్యాత్మిక శోభ.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల సందడి *పుట్టకు, జంట నాగులకు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు* ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ విశాఖ CII భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి మీకు అహంకారమా? నస్లేన్ అదిరిపోయే సమాధానం జిల్లెల్ల గూడెంలో ఎద్దుని చంపిన పెద్దపులి. -- ఎద్దును చంపి మాంసం తిన్న పెద్ద పులి. ‘రామాయణ’పై డిజైనర్ సుబ్రతా చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు నానా పటేకర్‌తో చివరి క్షణాలను గుర్తుచేసుకున్న మహేష్ మంజ్రేకర్ అభివృద్ధి బాటలో విశాఖ పటౌడీ ప్యాలెస్‌లో కరీనా కపూర్ కుటుంబ వేడుకలు శ్రీ చండికా దేవికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పణ అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ 'రూప' ప్రమోషన్స్‌లో కోమల్ రాణితో గోవిందా సందడి.. మూడు రోజుల లాభాలకు గండి, 460 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి : RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ

Select Suryaa Now
అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయండి :   RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకాతో మంత్రి లోకేష్ భేటీ

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

: RPSG గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శాశ్వత్ గోయెంకాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... RPSG వారి లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన FSP డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ (లగ్జరీ అపెరల్, బ్రైడల్ కౌచర్, ప్రీమియం రెడీ-టు-వేర్ గార్మెంట్స్) ను మంగళగిరిలో సోర్సింగ్ / తయారీ / డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. గ్రీన్ పవర్ లిమిటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్ ఫోలియోను ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సిందిగా కోరారు. సోలార్, BESS, గ్రీన్ హైడ్రోజన్ లో RTC (రౌండ్-ది-క్లాక్) గ్రీన్ ఎనర్జీని ఏర్పాటు చేయండి. విశాఖపట్నం, తిరుపతిలో కార్యకలాపాలను పెంచండి. ఆర్ పీఎస్ జీ అనుబంధ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ను విజయవాడలో ప్రస్తుతం ఉన్న దానిని విస్త‌రించాలి. విశాఖపట్నం లేదా తిరుపతిలో కొత్త ఐటీ కార్యకలాపాలు, కార్యాలయాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి. RPSG ఆధ్వర్యాన అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ సౌకర్యాన్ని కల్పించండి. ఫ్రాంచైజీ ఎకోసిస్టమ్ (లక్నో / డర్బన్ సూపర్ జెయింట్స్) అభివృద్ధికి రాష్ట్రం నుంచి గ్రాస్ రూట్ టాలెంట్ ను గుర్తించడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) లో స్థానిక జట్టును నిలబెట్టే అవకాశాలను పరిశీలించండి. రాష్ట్రవ్యాప్తంగా అసాధారణ ప్రతిభగల యువతను గుర్తించి, స్పాన్సర్ చేయాల‌ని RPSG ఎండీని కోరారు. గ్రామ స్థాయి శిక్షణ నుంచి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల వరకు రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ భాగస్వామ్య నమూనాను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ సూచించారు.   RPSG గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయంకా మాట్లాడుతూ... తమ గ్రూప్ సంస్థ అయిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ విజయవాడలో మేధా ఐటీ టవర్ లోపల ఆఫీస్ నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రూ.3,286 కోట్ల పెట్టుబడితో 349.8 MW విండ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు 2025లో విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. స్పెన్సర్స్ రిటైల్ పేరిట విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన ఏపీ పట్టణ కేంద్రాలలో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాశ్వత్ గోయంకా తెలిపారు.