ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ జెండా ఎగరేస్తాం
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి.. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా పనిచేసే ఎన్ఎంయు జెండాను ఎగరవేస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి. మదిలేటి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. లక్ష్మన్న, జిల్లా అధ్యక్షుడు ఎన్.ఆర్. నాయుడు, జిల్లా కార్యదర్శి, రీజినల్ కార్యదర్శి పి.ఎం.డి. ఇస్మాయిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఏపీఎన్‌జీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిపో చైర్మన్ ఎన్.పి.ఎం. సాహెబ్ అధ్యక్షత వహించగా, డిపో అధ్యక్షుడు ఎస్.ఎం. రఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డిపో చైర్మన్ ఎన్.పి.ఎం. సాహెబ్ మాట్లాడుతూ, రానున్న సీసీఎస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం కండక్టర్ కే. మదర్ సాహెబ్‌ను సీసీఎస్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథి పి.ఎం.డి. ఇస్మాయిల్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ సంఘం బలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు డిపోలో ఎన్ఎంయూ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు.అలాగే డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిపో మేనేజర్‌ను కోరుతూ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, సహాయ కార్యదర్శి షరీఫ్, కోశాధికారి చంద్రయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ తిమ్మప్పతో పాటు సుమారు 50 మంది ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా*