ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితునికి రిమాండ్
కోయిలకొండ సూర్య న్యూస్:
మహబూబ్ నగర్ ర్ జిల్లా హన్వాడ మండలంలో ఉన్న కిష్టం పల్లి తాండకు చెందిన మూడవత్ కృష్ణ ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జిల్లా కోర్టులో హాజరు పరచగా జిల్లా జడ్జి రిమాండ్ విధించారని ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోయిల్ కొండా మండలంలో ఉన్న సక్రియా నాయక్ తాండకు చెందిన యువతి మనిషా రాథోడ్ (25 ) ను ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కొన్ని రోజులు వాడుకుని వదిలివేయడం జరిగిందని యువతి తెలిపిందని తెలిపారు. అదేవిధంగా పెండ్లి చేసుకుందామని యువతి మొరపెట్టుకున్న నిందితుడైనట్టి యువకుడు ఒప్పుకోకపోవడంతో సెప్టెంబర్ నెలలో పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసిందని తెలిపారు. పరారు లో ఉన్న యువకుడిని పోలీసులు అదుపులో తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం నిందితుడిని మహబూబ్ న గర్ జె ఎఫ్ సి ఎం కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. రిమాండ్ నిమిత్తం నిందితుడిని మహబూబ్ న గర్ జిల్లా జైలుకు తరలించడం జరిగిందని తెలియజేశారు.
మల్లికార్జున్ గౌడ్, కోయిల్ కొండ