వేములపల్లి బ్రిడ్జి పై ధాన్యం ట్రాక్టర్ బోల్తా ఒకరికి గాయాలు
వేములపల్లి,మేజర్ న్యూస్:
వేములపల్లి మండల కేంద్రం లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెనపై శుక్రవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదం లో ధాన్యం ట్రాక్టర్ బోల్తా పడింది.
*ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా:*
మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ధాన్యం ట్రాక్టర్ లోడుతో వెళ్తుండ గా వంతెనపై అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
*రాకపోకలకు తీవ్ర అంతరాయం:*
నార్కట్ పల్లి - అద్దంకి రహదారిపై మిర్యాలగూడ వైపు వెళ్తున్న రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి రద్దీ ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
*గాయపడిన వ్యక్తిని వైద్యశాలకు తరలింపు:*
ఈ ప్రమాదంలో గాయపడిన కృష్ణారెడ్డిని అత్యవసర వాహనంలో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంత వైద్యశాలకు తరలించారు.