BREAKING
నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ శబరిమల భక్తులకు రైల్వే శాఖ తీపికబురు..నేటి నుంచే 54 ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు షురూ.. Friday OTT Movies : ఓటీటీలోకి 'రణబాలి'.. ఒక్క రోజే 18కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల సందడి! ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా యూరప్‌లో నిరుద్యోగ సమస్యకు చెక్‌..యువతకు ఉపాధి కల్పనపై నిపుణుల విశ్లేషణ Allu Sneha Reddy: అల్లు అర్జున్‌ సతీమణికి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక వేడుకలో కీలక బాధ్యతలు! దక్షిణ కొరియాలో కూపాంగ్ పునరుజ్జీవన ప్రయాణానికి రాజకీయ సెగలు బెల్లంకొండ 'హైందవ' నుంచి మెలొడీ ట్రీట్.. ఆకట్టుకుంటున్న 'ఎవరైనా' లిరికల్ సాంగ్ చైనా షేర్ మార్కెట్ రక్షణ వ్యూహం..మార్కెట్ నిపుణుల హెచ్చరికలు, భవిష్యత్ సవాళ్లు ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. షెన్‌జెన్‌లో డ్రోన్ల ద్వారా వినూత్నంగా ఫుడ్ డెలివరీలు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్.. ఔట్లుక్, టీమ్స్ సేవలకు భారీ అంతరాయం ఏపీలో కొత్తగా రూ.700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ సుముఖత : మంత్రి లోకేష్ తో డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ సిటడెల్ సెక్యూరిటీస్ ఆసియా విస్తరణ.. సింగపూర్, సిడ్నీ కార్యాలయాల ఆధునీకరణ

ట్రాక్టర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం *ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Select Suryaa Now
ట్రాక్టర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం  *ప్రమాదంలో యువకుడు దుర్మరణం

 

వేములపల్లి,మేజర్ న్యూస్:

వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో నార్కట్ పల్లి - అద్దంకి రహదారి మూలమలుపు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్ (23) దుర్మరణం పొందినట్లు వేములపల్లి ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు.

*సంఘటన వివరాలు:*

స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం మాడ్గులపల్లి మండలం దాచారం గ్రామానికి చెందిన బుర్రి లోకేష్ ద్విచక్ర వాహనంపై మాడ్గులపల్లి నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న క్రమంలో వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో నార్కట్ పల్లి - అద్దంకి రహదారి మూలమలుపు వద్ద పాములపాడు వైపు వెళ్లేందుకు పాములపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ ను నడిపే వ్యక్తి సబ్బు మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా వెనక్కి మలుపు తిప్పడంతో ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ను ఢీకొట్టింది.

*తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి:*

ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయాలై రక్తం స్రవించి అక్కడికక్కడే మృతి చెందాడు.

*మృతదేహాన్ని వైద్యశాలకు తరలింపు:*

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మిర్యాలగూడ ప్రాంత వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను పోలీసు స్టేషన్ కి తరలించారు.

*ఫిర్యాదు నమోదు - దర్యాప్తు:*

మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు.