BREAKING
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీలు ట్రెజరీ ఉద్యోగి. హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్ పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ* జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం

ఏపీలో కొత్తగా రూ.700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ సుముఖత : మంత్రి లోకేష్ తో డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ

Select Suryaa Now
ఏపీలో కొత్తగా రూ.700 కోట్ల పెట్టుబడులకు డిక్సన్ సుముఖత :  మంత్రి లోకేష్ తో డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ భేటీ

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :

 డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ & చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పంకజ్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ తో భేటీ అనంతరం తిరుపతి - EMC-IIలో కొత్తగా రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సుముఖత వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్ర యువతకు 2,300 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ ప్లాంట్ అయిన డిక్సన్ తిరుపతి హబ్... కొప్పర్తి, తిరుపతిలో విస్తరణ ప్రణాళికలను రూపొందించడంపై మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. డిక్సన్-ఇన్వెంటెక్ JV కింద ల్యాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. డిక్సన్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ మాట్లాడుతూ... డిక్సన్ టెక్నాలజీస్ కు భారతదేశంలోనే అతిపెద్ద LED టీవీ ప్లాంట్ (షియోమి, ఇతర బ్రాండ్లు) ఇన్-హౌస్ LCM లైన్ తో 2018 నుంచి తిరుపతిలో ఉందని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ (సీపీ ప్లస్)ను రూ.450కోట్లతో విస్తరిస్తున్నామని, దీని ద్వారా 7వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. దీనికి ఇప్పటికే ఎస్ఐపీబీ ఆమోదం లభించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.