వెల్దుర్తి అంబేడ్కర్ గురుకులానికి రాష్ట్ర స్థాయి అవార్డు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించింది. 'క్లీన్-అప్ డే బెస్ట్ స్కూల్ అవార్డుల' (Clean-Up Day Best School Awards) కింద రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యాసంస్థగా (State-Level Best Performing Institution) ఈ గురుకులం ఎంపికైంది.నెట్ జీరో హెల్తీ క్యాంపస్ (NZHC) కార్యక్రమంలో భాగంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును ప్రకటించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ విధానాల అమలులో కనబరిచిన ప్రతిభకు గాను ఈ పురస్కారం దక్కింది. ఈ అరుదైన ఘనత సాధించిన పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థినులను జిల్లా కో-ఆర్డినేటర్ (DCO, కర్నూలు) ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.