BREAKING
జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి రవీంద్రభారతిలో ఘనంగా న్యాయవాదుల సంగీత విభావరి నిర్మాణ రంగానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. తాగునీటికి బదులుగా శుద్ధి జలాల వినియోగం! మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గిగ్ వర్కర్స్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీకి శ్రీకారం వత్సవాయి, పెనుగంచిప్రోలు నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించిన తొండపు దశరథ జనార్దన్ వెల్దుర్తి అంబేడ్కర్ గురుకులానికి రాష్ట్ర స్థాయి అవార్డు దుండిగల్‌లో వైద్య సేవలకు సిబ్బంది కొరత.. చిన్నారుల టీకాలపై ఆందోళన శాంతి భద్రతల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమావేశం మండల పూజలకు సిద్ధమైన శబరిమల.. ఎల్లుండి సాయంత్రం దర్శనాల ప్రారంభం బస్తీల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే తలసాని పాఠశాలకు కూలింగ్‌ క్యాన్లు అందజేత నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్

గిగ్ వర్కర్స్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీకి శ్రీకారం

Select Suryaa Now
గిగ్ వర్కర్స్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీకి శ్రీకారం

హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హైటెక్స్ ముందున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిగ్ వర్కర్స్ (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు తదితర అసంఘటిత రంగ కార్మికులు) నిర్వహించిన భారీ ర్యాలీని రాహుల్ గాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

తదనంతరం జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా 'గిగ్ వర్కర్స్ పాలసీ'ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పాలసీ ప్రారంభంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ సంక్షేమ పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద బీమాతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందనున్నాయి.