BREAKING
హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్ పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం అప్పు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రీకొడుకులపై దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ* జెడ్ కొత్తపల్లి సమీపంలో ఆటో బోల్తా 9 మందికి గాయాలు జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం దూలపల్లి–జీడిమెట్ల రోడ్డు విస్తరణకు వేగం పెంచాలి రవీంద్రభారతిలో ఘనంగా న్యాయవాదుల సంగీత విభావరి నిర్మాణ రంగానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. తాగునీటికి బదులుగా శుద్ధి జలాల వినియోగం! మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గిగ్ వర్కర్స్ ర్యాలీని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీకి శ్రీకారం వత్సవాయి, పెనుగంచిప్రోలు నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను అభినందించిన తొండపు దశరథ జనార్దన్

నిర్మాణ రంగానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. తాగునీటికి బదులుగా శుద్ధి జలాల వినియోగం!

Select Suryaa Now
నిర్మాణ రంగానికి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు.. తాగునీటికి బదులుగా శుద్ధి జలాల వినియోగం!

                నిర్మాణ అవసరాలకు తాగునీరు, భూగర్భ జలాలను వినియోగించవద్దు: కమిషనర్

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి);హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జలమండలి చేపట్టిన డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ కార్యక్రమం నిర్మాణ రంగానికి విస్తరించింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్టీపీల్లో తృతీయ దశలో శుద్ధి చేసిన నీటిని వినియోగించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాంగణంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుద్ధి జలాలను వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థగా వాసవి గ్రూప్ నిలిచింది.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా టెర్షియరీ శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. అన్ని నిర్మాణ సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముందుకొచ్చిన వాసవి గ్రూప్‌ను అభినందించారు.

జలమండలి మల్కాజిగిరి రీజియన్ ఈడీ ఎస్. పంకజ మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంగణాల్లో కాంక్రీట్ క్యూరింగ్, దుమ్ము నియంత్రణ, శుభ్రపరిచే పనులకు మాత్రమే శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. శుద్ధి జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీ ఏసీపీలు, జలమండలి డీజీఎంలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

*మూడు ఎస్టీపీల నుంచి 56 లక్షల లీటర్లు:*
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ (2.50 ఎంఎల్‌డీ), పటేల్ చెరువు (2.50 ఎంఎల్‌డీ), సఫిల్‌గూడ (0.60 ఎంఎల్‌డీ) ఎస్టీపీల నుంచి రోజుకు మొత్తం 5.60 ఎంఎల్‌డీ (56 లక్షల లీటర్లు) టెర్షియరీ శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నీటిని జలమండలి ఉచితంగా అందిస్తుందని, వినియోగదారులు రవాణా ఖర్చులు మాత్రమే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలు తమ సొంత ట్యాంకర్లను గ్రీన్ వాటర్ ట్యాంకర్లుగా నమోదు చేసుకోవచ్చని, లేదంటే డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 155313 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ పంకజ, డైరెక్టర్ బి. నారాయణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ, జలమండలి అధికారులు, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.