BREAKING
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పిఎఎమ్ శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఈదులవలస విద్యార్థినులకు ప్రథమ బహుమతులు వేంపెంటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎనిమిది కుటుంబాలు! ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో టీడీపీలో చేరిన దాదాపు 30 మంది ఫీజుల బకాయిలు చెల్లించరా? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ఎందుకింత వివక్ష? ఆర్‌. కృష్ణయ్య కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోతుగంటి ఖలీల్ హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్ సమావేశం తేదీ మార్పు అంక్సాపూర్ ఉన్నత పాఠశాలలో అలరించిన బాలసభ గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ఆయుష్ వైద్యులకు అవకాశం కల్పించాలి: డా. చినుకని శివప్రసాద్ నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ కౌకూర్ గ్రామం కింది బస్తీలోవర్షం నిరు, వర్షపు నీటి కాలువల పనులను పరిశీలించిన బి. ఆర్. ఎస్. నాయకులు గిగ్ వర్కర్లకు 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం.. రాహుల్ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు: సీఎం రేవంత్ రెడ్డి ఇన్ముల్నర్వ ప్లాట్ల ఈ-వేలానికి భారీ స్పందన

ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ*

Select Suryaa Now
ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల భూ పరిరక్షణకు భారీ ర్యాలీ*

                        పాఠశాల స్థలాన్ని ప్రభుత్వం వెంటనే నోటిఫై చేయాలి: జేఏసీ డిమాండ్

నిజాంపేట్ మేజర్ న్యూస్ :ప్రగతి నగర్ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూ పరిరక్షణ కోసం జెడ్పీహెచ్ఎస్ ప్రగతి నగర్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆల్విన్ చౌరస్తా మీదుగా వాసవి లేఅవుట్ వరకు కొనసాగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాల భూమిని కాపాడాలంటూ నినాదాలు చేశారు. పాఠశాలకు సంబంధించిన 1.06 ఎకరాల స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించాలని, భూమిని ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పాఠశాల స్థలంపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ భూపతిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థల పరిరక్షణకు తమ వంతు బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, కార్యక్రమం ముగింపు సమయంలో డీఈఓ వ్యవహరించిన తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో తగిన శ్రద్ధ చూపకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. పాఠశాల భూమికి అధికారికంగా రక్షణ కల్పించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. పాఠశాల స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసి, భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రగతి నగర్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.