అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన....సర్పంచ్
సూర్య బెజ్జుర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ కవిత మంజు నాయక్, కార్యదర్శి,ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పిల్లలకు సరుకులు సక్రమంగా అందించడం లేదని వచ్చిన సమాచారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, విద్య, ఆటపాటలు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు...